నగర ప్రయాణికులు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం అందించడంతో పాటు ఇతర రవాణా సౌకర్యలను కూడా అను సంధానిస్తూ మెట్రో ప్రయాణం సాగుతుంది. మూడు కారిడార్ల విషయానికి వస్తే నాంపల్లి (హైదరాబాద్), సికింద్రాబాద్, బేగంపేట రైల్వేష్టేన్లతో కనెక్టివిటి ఉంది. అదేవిధంగా మియాపూర్, దిల్ సుఖ్ నగర్ ఎంజీబిఎస్, జూబ్లీ బస్ స్టషన్, రేతిపైల్, కోఠి, ఫలక్ నుమా బస్ స్టేషన్లతో మెట్రోకు కనెక్టివిటీ ఉంది. దీంతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లతో కూడా కనెక్టివిటీ ఉంది. ఎంఎంటీఎస్ స్టేషన్ల విషయానికి వస్తే భరత్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, మలక్ పేట, ఫలక్ నామా స్టేషన్లతో కనెక్టివిటీ కలిగి ఉంది. అంతేగాకుండా ప్రతీ మెట్రోస్టేషన్ మెట్రోస్టేషన్ నుంచి కాలనీలకు 10 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంది.

24 స్టేషన్లు… 70వేల మంది ప్రయాణికులు…….

నాగోల్ నుంచి మియాపూర్ మధ్యలో 30 కిలోమీటర్ల ప్రయాణం 24 స్టేషన్ల మీదుగా కొనసాగుతూ ప్రస్తుతం ప్రతీ రోజు 70 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చుతుంది. క్రమేపీ రద్ధీ పెరిగే అవకాశం కనబడుతున్నది. సాఫీగా ఎటువంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాగే మెట్రోరైలు వైపే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఏసీ ప్రయాణంతోపాటు కాలుష్య రహితం కావడం, తక్కువ సమయంలో గమ్యాని చేరే అవకాశం ఉండటంతో ఉద్యోగులు దీన్నే అశ్రయిస్తున్నారు. అంతేగాకుండా ఐటీ ఉద్యోగలు, ఇతర ప్రయాణికులే కాకుండా మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్డిపేట జిల్లాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణికులకు మియాపూర్ స్టేషన్. అదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, జిల్లాలకు రాకపోకలకు ప్రయాణికులకు జేబీఎస్, అదేవిధంగా నాగోల్, వరంగల్, భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణీకులు ఉప్పల్ మెట్రోస్టేషన్ల ద్వారా ప్రయాణం చేసేలా కారిడార్ల, స్టేషన్లు డిజైనయ్యాయి. ఇక ఇతర రాష్ర్టాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా దిగి అక్కడున్న సమీపంలోని మెట్రోస్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు.

నిత్యం 18 రైళ్లు…..

నాగోల్ నుంచి మియాపూర్ మధ్యన ప్రతీరోజు 18 రైళ్లు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ నాగోల్ మధ్య 8 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ప్రతీ 7 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటున్నది. మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు ఒక రైలు 7 నిమిషాల కొకటి అందుబాటులో ఉంటున్నది. అదేవిధంగా అమీర్ పేట్-నాగోల్ మద్య అరున్నర నుండి 7 నిమిషాలకొక రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో 10 రైళ్లు నడుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here