అమీర్ పేట హైటెక్ సిటీ మార్గం అక్టోబర్ నుంచి మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మెట్రోరైలును గడువులోపు పూర్తి చేయడానికి ప్రభుత్వం దష్టి సారించిందని చెప్పుకొవచ్చు. పలు కారిడార్లలో అతివేగంగా పనులు పూర్తి చేయాలని మెట్రో అధికారులను అదేశించింది ప్రభుత్వం. ఈ క్రమంలో మూడు కారిడార్లలో ఆస్తుల సేకరణపై ప్రధానంగా దష్టి సారించింది. ఇటీవల సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రోరైలు మూడు కారిడార్లను నిర్ధారిత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అదేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి పనులు అలస్యం జరగడానికి వీల్లేదని సూచించారు. మూడు మెట్రో కారిడార్లలో సుమారు 180 వరకు అస్తులను సేకరించాల్సిన అవసరమున్నదని మెట్రోరైలు ఉన్నతాధికారులు ప్రభుత్వం వైపు తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా జూబ్లీహిల్స్ వద్ద రెండు అస్తులు, మాదాపూర్ వద్ద మూడు అస్తులకు సంబందించిన చెక్కులను అందజేసే ప్రక్రియలో ఉన్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా సీఎస్ కు వివరించారు. చిక్కడపల్లిలోని రెండు అస్తులకు చెందిన సొమ్మును మెట్రోరైలు విభాగం డిపాజిట్ చేయాలని సీ ఎస్ కు తెలపారని సమాచారం.

దుర్గం చెరువు వద్ద మెట్రో స్టషన్ కోసం అరు అస్తులకు సంబంధించిన డబ్బుల అందజేత ప్రక్రియ ఈ నెలలోనే కొనసాగుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందరావు ప్రధాన కార్యదర్శికి వివరించినట్టు తెలిసింది. మొత్తనికి గడువులోపే మెట్రో పనులు పూర్తవుతాయని సంస్థ ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి తెలిపారు.

మూడు కారిడార్లు ….

నగరం మొత్తం మెట్రో రైల్ ను మూడు కారిడార్లు విస్తరిస్తున్న విషయం విదితమే. ఇందులో అమీర్ పేట నుంచి ఎల్బీనగర్ మార్గం 16 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటి 11కిలోమీటర్లతో పాటు, జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పెండింగ్ లో ఉన్న కారిడార్ 1,3 పనులు త్వరలో పూర్తికావాల్సి ఉండగా కారిడార్ 1వరకు సంబంధించి 10 కి. మీటర్ల వరకు సంవత్సరం చివరినాటికి అందుబాటులోకి రానుంది.

కారిడార్ -1……

మియాపూర్ నుంచి ఎల్ బి నగర్ మధ్య ఈ కారిడార్ ఉంది. ఈ 27 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఒక గంట 45 నిమిషాలు సమయం తీసుకుంటుందని అంచనా వేశారు. మెట్రోలో ప్రయాణిస్తే ఈ దూరాన్ని కేవలం 45 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు అని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఎటువంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా కాలుష్యం బారిన పడకుండా నిర్ణీత సమయంలోగా గమ్యస్థానం చేరవచ్చు.

కారిడార్-2……..

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా మార్గంలో 15 కిలో మీటర్ల దూరం కారిడార్ 2లో ఉంది. రోడ్డు మార్గం ద్వారా అనేక అవాంతరాలతో ప్రయాణిస్తే ఒక గంట 10 నిమిషాలు ప్రయాణ సమయం పడుతుంది. అదే మెట్రో మార్గం పూర్తి మెట్రో రైలులో ప్రయాణిస్తే 15కిలోమీటర్ల దూరాన్ని కేవలం 22 నిమిషాల్లో చేరుకోవచ్చు.

కారిడార్ 3……

నాగోల్ నుంచి రాయదుర్గం వరకు 28 కి.మీ ప్రయాణించనున్న ఈ మార్గం ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్ పేట వరకు పూర్తయి ప్రయాణికులను గమ్యస్థానానలకు చేర్చుతున్నది. 28 కి.మీ ప్రయాణాన్ని రోడ్దు మార్గం ద్వారా ఒక గంట 26 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఇదే దూరాన్ని మెట్రో ప్రయాణంలో 22 నిమిషాల్లో చేరవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here