Hyderabad Metro Project History

మెట్రో రైల్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలొ ఎన్నో ఒడిదొడుకుల మద్యం ప్రాణం పోసుకుందని చెప్పవచ్చు. అప్పట్లో 2012లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మొదలైన మెట్రో రైలు నిర్మాణం అంచెలు అంచెలుగా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె. సి. ఆర్ చోరవతో ఇది  హైదరాబాదు  రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు దశల వారిగా ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది  ప్రపంచం లో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగామరియు గ్రీన్ సిటీగా మారుస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిస్తుందనడానికి అతిశయోక్తి కాదు.

మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్‌ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్‌లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.

పెరిగిపోతున్న ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. వాటి వివరాల్లోకి విళితే….

కారిడార్స్టేషన్లుప్రయాణ సమయందూరం
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు2747నిమిషాలు29కిలో మీటర్లు
నాగోలు నుండి శిల్పారామం2330 నిమిషాలు28కిలో మీటర్లు
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా1622నిమిషాలు15కిలో మీటర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన “వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్”లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి వివరంగా ప్రచురించబడింది. అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.

విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది. ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది. తమంతట
తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు చేశారు. ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము. రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలకు ఒక రైలు. మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.

Hyderabad Metro Rail Speciality

ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.స్టేషన్ ను స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు. ఫ్లాట్ఫారాలకు, ఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది. ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నారు. సామాను పరిశీలనా ఆధునాతన పరికరాలు మరియు ప్రాథమిక చికిత్సా పరికరాలను అందుబాటులో ఉంచుతారు.

రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు. ఈ రైలు అత్యధికంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు – MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణంతో పాటు అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానంతో రూపోందించారు. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు చేశారు. తమంతట తామె తెరుచుకునే తలుపులతో కూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు మెట్రో రైలుకి ప్లస్ అని చెప్పవచ్చు. ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు. రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము. రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలకు ఒక రైలు. టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు ఉటుందని ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు ఉంటాయి.

Hyderabad Metro Rail Advantages

మొదటిగా ముఖ్యంగా చెప్పుకొవలసింది సురక్షిత ప్రయాణం అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది. రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది. ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు పడుతుంది. అదే బస్ లో ప్రయాణం 2గంటలు పడుతుందనిన ఆశ్చర్యం అవసరం లేదు. జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు. నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు. మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. దీంతో నిరుద్యొగ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందని చెప్పకనే చెప్పవచ్చు.