ప్రత్యేక భద్రతా విభాగం…

ఎంతో ప్రతిష్టాత్మకంగా మరో ఐదు రోజుల్లో మెట్రో రైలు ప్రయాణం కానున్న సంగతి తెలిసిందే. దీంతో మెట్రో రైలు భద్రత పై ట్రై కమిషనరేట్ల పోలీసులు పనులు మొదలు పెట్టారు. ఇప్పటికి విషయమై హెచ్ఎంఅర్ఎల్, రాష్ర్ట పోలీస్ బాస్ మహెందర్ రెడ్డి ఇతర విభాగాల ఉన్నతాధికారులు సమావేశమై భద్రతపై చర్చించారు. మొదటి దఫాలో నాగొల్ నుంచి మియాపుర్ వరకు మెట్రొ పరుగులు పెట్టనుండడంతో ఇక్కడ భద్రతకు సంబంధించిన సిబ్బందిని నియమించేందుకు మూడా కమిషనరేట్ల పోలీసులు సన్నాహలు చేస్తున్నారు.

30కిలోమీటర్ల పరిధిలో 24 మెట్రొ స్టేషన్లు వస్తుండగా ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరెట్ల పరిధిలో 13, సైబరాబాదాలో 8, రాచకోండ కమిషనరెట్ పరిధిలో 3 మెట్రో స్టేషన్లు వస్తున్నాయి. రాచకోంద కమిషనరేట్ పరిధిలోని నాగోల్ స్టేషన్ నుంచి మెట్రో రైలుకు సంబంధించిన అపరేషన్లు పర్యవేక్షిస్తారు. ఈ స్టేషన్ వద్ద హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు 2:1 నిష్ఫత్తిలో బందోబస్తులో పాల్గొంటారు. మెట్రొ భద్రతకు 2,078 మంది సిబ్బంది అవసరమని ఉన్నత స్థాయిలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

ఒక్కో స్టేషనలో 70 నుంచి 100 సీసీ కెమెరాలు

మెట్రో రైలు నిర్వహణ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయా స్టేషన్లకు కావాల్సిన పూర్తి బందోబస్తును మూడు కమిషనరేట్ పోలీసులు చూసుకుంటుండగా, మెట్రో సంస్థ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా సమాకురుస్తున్నది. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులు విభాగం ఆద్వర్యంలో పనిచెస్తారు. ప్రస్తుతం ప్రారంభంకానున్న నాగోల్ నుంచి మియాపూర్ రూట్లలో 546 ప్రైవేట్ సెక్యూరిటీని హెచ్ఎంఅర్ఏలో పోలీసు విభాగం ఆద్వర్యంలో పనిచేసేందుకు నియమిస్తున్నది. ఒక్కొ మెట్రో రైలు స్టేషన్లలో అత్యాదునిక హై హెచ్ డి సీసీ కెమెరాలు 360 డిగ్రిలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కొ స్టేషన్లో సుమారు 70 నుంచి 100 కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అయా స్టేషన్ లో ఒక కమాండ్ కంట్రొల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డీఎంఎఫ్ డీ), తదితర పరికరాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంవత్సరంలో మెట్రో సెక్యూరిట్ వింగ్….

మన మెట్రో రైలు పూర్తిస్థాయిలో నగరంలోకి అందుబాటులోకి వచ్చె సమాయానికి అంచెలంచెలుగా ప్రత్యెకంగా మెట్రో సెక్యూరిటీ వింగును ఏర్పాటు చేయనున్నారు. దీనికి మెట్రో పోలీస్ అనే నామకరణం చేసే అవకాశాలున్నాయి. అందులో క్విక్ రెస్పాన్స్ టీమ్, బాంబు డిస్పోజల్, డాగ్ స్కాడ్ లతో పకడ్బందిగా భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రస్తుతం సికిందిరాబాద్ (ప్యారడైజ్), అమీర్ పేటలలో రెండు పోలీస్ స్టేషన్ల ఆద్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. ఒకో స్టషన్ కు ఎస్ హెచ్ ఓ గా ఇన్స్పక్టర్ స్థాయి అధికారిని నియమిస్తూ ఆ స్టేషనుకు కిందకు కొన్ని మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మెట్రో స్టేషన్లో ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అధికారులు ప్రతి షిప్టులో బందోబస్తులో ఉంటారు.

మీ అద్వర్యంలోనే ప్రైవేట్ సెక్యూరిటి బందొబస్తు నిర్వహణ బాధ్యతలలో ఉంటారు. మెట్రో వ్యవహరాలకు సంబంధించి ఓ డీసీపి నేత్రత్వంలో అదనపు డీసీపీ, ఇద్దరు ఏసిపీలు, నలుగురు ఇన్స్ పెక్టర్లను భారీగా బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని శాంతి భద్రతలు, ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్ పోర్స్ ఎస్ఓటీ ట్రాఫిక్ ఇతర సెక్యూరిటి విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. ఇదిలా ఉండగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు ప్రతి మెట్రో స్టేషన్ లలో మహిళా పోలీసులు, షి టీమ్స్ నిఘాను ఏర్పాటు చేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు…..

మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు సమన్వయంతో మెట్రో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో రైలు మొదటి దశ ప్రారంభమైన తరువాత అక్కడి పరిస్థితులను బట్టి మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ముందుగా హెచ్ఎంఅర్ఎల్ కొరినట్లు బందోబస్తును ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నాం మెట్రో ప్రారంభం తరువాత అయా స్టేషన్ల సమీపంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలుంటాయి. దీంతో దీనిపై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి సాదించాం. ఒక పక్క మెట్రోస్టేషన్లలో అంత్యంత భద్రత, మెట్రో బయట ట్రాఫిక్ వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం అయితే మెట్రొ ప్రారంభమయిన తరువాత ఆ సమస్యలు తెలుస్తాయి, దానిని బట్టి సిబ్బందిని మరింతగా పెంచుతాం.
హైదరాబారద్ సిపీ. వీవీ శ్రీనివాస్ రావు….

ఎలివెటర్స్…..

వీటిని ప్రత్యేక అవసరాల కోసం ఎర్పాటు చేశారు. ఇందులో కేవలం అందులు, వృద్దులు ఉపయోగించుకోవాలి. హెవీ లగేజ్, బేబీ కార్ట్ ట్రాలీ, బ్యాగేజ్ లకు ఎలిపేటర్స్ లలో అనుమతి ఉన్నది. ఎస్కలేటర్ ఎక్కేటపుడు మూవింగ్ డైరెక్షన్లో పాదం పెట్టాలి దీనిమీద నడవడం కానీ, కూర్చోవడం కానీ చేయవద్దు, ఎస్కలేటర్ మీద ప్రయాణించేటప్పుడు ఎడమవైపు నిల్చోవాలి, పిల్లలతో ప్రయాణించేటప్పుడు వారి చేయి పట్టుకోవాలి. చీరలు దుప్పట్లు ధరించిన వారు అప్రమత్తంగా ఉండాలి. గమ్యం చేరగానే ఎస్కలేటర్ దిగి అక్కడ నుంచి వెళ్లిపోవాలి. అత్యవసర పరిస్తితి ఏర్పడినప్పుడు ఎమర్జన్సీ బటన్ నొక్కలి, ప్రతి ఎస్కలేటరకు ఎరుపు రంగులో దీనిని ఏర్పాటు చేశారు గమనించాలి.

సెక్యూరిటీ చెక్ దాటి…..

కాంకర్స్ లెవెల్లో నాలుగు పక్కల ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ గేట్ల ద్వారా స్టేషన్లోకి రాకపోకలు సాగించవచ్చు. రైల్లో ప్రయాణించడానికి టికెట్ ఉంటేనే పెయిడ్ ఏరియాకు అనుమతిస్తారు. ఇది పూర్తిగా స్ట్రీట్ లెవెల్ తో పాటు కాంకర్స్ లెవెల్, రిటైల్ ఏరియాలు దాటాక సెక్యూరిట్ చెక్ ఉంటుంది. చెక్ లో భాగంగా ఎక్స్రే బ్యాగేజి స్కానర్, డోర్ ప్రేమ్ మెటల్ డీటెక్టర్ (డీఎప్ఎండీ), లగేజీ 10 కిలోల బరువు లేదా సెంటి మీటర్ల పోడువు, 25 సెంటీ మీటర్ల ఎత్తు, 45 సెంటీమీటర్ల లావు దాటకూడదు.

లగేజీ 10 కిలోల లోపే…..

మెట్రో రైలు ప్రయాణంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ ఎల్ అండ్ టీ వర్గాలే ప్రకటన విడుదల చేశాయి. స్రీట్ లెవెల్, కాంకర్స్ మెట్లు ఎస్కలేటర్స్, ఎలిపేటర్స్ ను ఎలా ఉపయోగించాలో తెలియచేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టికెట్లు టోకెన్ లు ఎలా కొనుగోలు చేయాలో తెలిపారు.

మీరు వెళ్లే దారి తెలుసుకోండిలా…..

మీరు స్టేషన్లలో ఎటువైపు వెళ్లాలనే అంశాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో అనౌన్స్ మెంట్లు ఇస్తారు. ప్రతి స్టేషన్లో నెట్వర్క్ మ్యాప్, స్టషన్ లే అవుట్, లోకల్ ఏరియా మ్యాప్, టైం టేబుల్, అత్యవసరం ద్వారాలు, హెల్స్ పాయింట్లు ఎమర్జెన్సీ, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ వంటి సూచికలు మూడు ప్లోర్లలో అందుబాటులో ఉంటాయి.

టోకెన్స్, టికెట్స్ కొనుగోలు చేయడమిలా…..


మెట్రో రైలు స్టేషన్ మొదటి భాగంలో టికెట్ ఆఫీస్ మెషన్ (టీఓఎం) ద్వారా టోకెట్ పెండింగ్ మెషన్స్(టీవీఎం) ద్వారా టికెట్లు కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. ఈ రెండు యంత్రాలను పక్కపక్కనే ఏర్పాటు చేశారు.

స్మర్ట్ కార్డ్స్ టాప్ ఆప్ ఇలా……

మెట్రోరైల్ ప్రయాణికులకు స్మార్ట్ కార్డ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఆన్ లైన్ ద్వారా ఎల్ అండ్ టీ వెట్ సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. లెవెల్ లో ఉన్న అన్ పెయిడ్ ఏరియాలో ఉన్న టికెట్ అఫీస్ మెషన్స్ (టీఓఎం) టీకెట్ వెండింగ్ మెషీన్స్ (టీవీఎం) తో పాటు పెయిడ్ ఏరియాలో ఉన్న యాడ్ వాల్యూ మెషన్ (ఏవీఎం) ఎల్ అండ్ టీ వెబ్ సైట్ ద్వారా రీచార్జ్ (టాప్అప్) చేయవచ్చు. ఐతే ఆన్ లైన్ లావాదేవీలన్నీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్దు ద్వారా జరపాలి.

పసుపు రంగు గీత వెనకే వేచివుండాలి…..

మెట్రో రైలు ప్లాట్ ఫాం వద్ద ఉన్న పసుపు గీతను ప్రయాణీకులు దాటవద్దు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు, వృద్దులకు చేయూత నివ్వాలి. వీల్ చైర్ లో వచ్చే ప్రయాణీకులకు కోచ్ లు రైలు ముందు వెనుక భాగంలో ఉంటాయి.

ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్……

ప్రతి మెట్రో రైలు స్టేషన్లో అటోమేటిక్ గేట్లు ఉంటాయి. టోకెన్, స్మర్ట్ కార్డు ద్వారా వీటిని దాటి లోపలికి వెళ్లవచ్చు. 3 ఫీట్లు లోపు ఎత్తు ఉన్న పిల్లలకు స్మర్ట్ కార్డు అవసరం లేదు. వీరిని చేయి పట్టుకుని గేట్లు జాగ్రత్తగా దాటించాల్సి ఉంటుంది. ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్, టై డైరెక్షనల్, వైడ్ గేట్ లతో మూడు రకాల గేట్లు ఉంటాయి. వీల్ చైర్ల కోసం కోసం టై డైరెక్షనల్ గేట్లు వాడుతారు.

ఎగ్జిట్ ఇలా…….

ప్రయాణ ముగించుకుని గమ్యానికి చెరేటప్పడు మెట్లు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లు వాడుకోవాలి. ఏ,బీ,సీ,డీ లుగా విభజించిన ఎగ్జిట్ పాయింట్ల ద్వారా బయటకు పెట్టాలి. వెళ్లేటప్పుడు ఎగ్జిట్ పాయింట్లో ఉన్న బాక్స్ వద్ద టోకెన్ లేదా టేకెట్ ను బాక్స్ లో వేయాలి. చివరగా స్ర్టీట్ లెవెల్లో దిగిపోవాల్సి ఉంటుంది. స్ట్రేట్ లెవెల్స్ లో పీకప్ అండ్ డ్రాప్ పాయింట్స్ బస్సులు, అటోరిక్షాలు, క్యాబ్స్ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here