హైటెక్ సిటీ నుండి LB నగర్ మధ్య మొత్తం 25 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి.
అందుబాటులోకి మొత్తం 45 కిలోమీటర్లు.. 42 చోట్ల మల్టీలెవల్ కార్ పార్కింగ్ లు……
సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ లతోపాటు…
ఎం.జి.బి.ఎస్ తో మెట్రో అనుసంధానం…
నాంపల్లి నుంచి రంగమహల్ వరకు…
చారిత్రక కట్టడాల వద్ద ప్రత్యేక అభివృద్ది.. మంత్రి కేటీఅర్ వెల్లడి..
నగరంలో మెట్రో పనుల పరిశీలన….

LB Nagar to Ameerpet Metro Train

ఎల్ బి నగర్ – అమీర్ పేట మార్గంలో మెట్రో రైల్ జూలై చివరినాటికి పూర్థి స్థాయిలో  సిద్దమవుతుందని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం ప్రకారం అపరేషన్స్ ను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. హైట్ క్ సిటీ మార్గం అక్టోబర్ నెల వరకు సిద్దమవుతుందని పేర్కొన్నారు. బుధవారం నిర్వహంచిన మెట్రో ట్రయల్ రన్ లో అమీర్ పేట నుంచి ఎల్బీనగర్ వరకు మంత్రి ప్రయాణించారు. మెట్రో పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీ ఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న మెట్రోరైలు సాహసోపేతమైన ప్రయోగమని, ఇది సఫలమైందని అన్నారు. ట్రయల్ రన్ ప్రారంభమైనందున ఎల్ బి నగర్ కారిడార్లు ప్రజల ప్రయాణ అవసరాలు త్వరలో తీరునున్నాయన్నారు.

నాగోల్ నుంచి మియాపూర్ వరకు ప్రారంభించిన 29కిలోమీటర్ల మెట్రో ప్రయాణానికి మంచి అధరణ లభిస్తుందని చెప్పారు. ప్రతి రోజూ 80వేల మంది ప్రయాణించడమే దీనికి నిదర్శనమన్నారు. ఇందులో 40% స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణిస్తున్నారంటే మెట్రోపై ప్రజలు ఎంత అసక్తి కనబరుస్తున్నారో అర్థమవుతున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చెన్నై, బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోల్లో ప్రయాణికుల సంఖ్య రోజుకు 25 వేలు దాటడం లేదని, హైదరాబాద్ మెట్రోలో ఒక్క రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతున్నదని హైటెక్ సిటీ, పంజాగుట్ట మెట్రో మాల్స్ కు కూడా అదరణ లభస్తున్నదని చెప్పారు. ఎర్రమంజిల్ మాల్ ప్రారంభానికి సిద్దంగా ఉందన్నారు. మొజంజాహీ మార్కెట్, నాంపల్లి రైల్వేస్టేషన్, రంగమహల్ లోని చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు మరింత ప్రత్యేకతను సంతరించుకునేలా అభివృద్ది చేస్తామని మంత్రి చెప్పారు.

Specialities in Hyderabad Metro

మెట్రోరైటు చార్జీలు ప్రస్తుత అర్టీసీ ఏసి బస్సులకంటే తక్కువని మంత్రి కేటీఆర్ చెప్పారు. చెప్పారు.మన మెట్రో ఎంతో ప్రత్యేకత తో కూడకున్నదని మెట్రో ప్రారంభించి ఏడు నెలలైనా ఎలాంటి ఫిర్యాదులులేవన్నారు. డిల్లీ మెట్రోతో చార్జీలను పోల్చవద్దని, అది పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడంవల్ల చార్జీల్లో తేడా ఉంటుందన్నారు. మెట్రో పాసులపై అలోచిస్తున్నామని తెలిపారు.

Parking Zones at Metro Stations

పార్కింగ్ సమస్య పరిష్కారనికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని మంత్రి కేటిఆర్ తెలిపారు.  నగరంలో 42 మల్టీలెవల్ కార్ పార్కింగ్ ల నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్లు అహ్వనించనున్నట్టు వెల్లడించారు. ఆధునిక కార్ పార్కింగ్ అందుబాటులోకి తేవాలన్నదే మా లక్ష్యం అన్నారు. నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లతోపాటు, ఎంజీబీఎస్ తో మెట్రో స్టేషన్లను అనుసంధానించి, ప్రజలకు సులభ ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Electric Charging Stations at Metro Stations

నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు లాస్ట్ మైల్ కనక్టివిటీలో భాగంగా ఎలక్ట్రిక్వాహనాలను మెట్రోకు అనుసంధానంగా నడిపిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వాహనాల చార్జింగ్ బస్ డిపోలు, కార్ పార్కింగ్ కాంప్లెక్సులు, బస్ స్టేషన్లలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. నగర యువతకు ఉపాధి కల్పించేందుకు జీహెచ్ఎంసీ సెట్వీన్ కలిపి మినీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే మహేంద్ర, ఉబర్ సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుందని వెల్లడించారు. ఇప్పటికే మియాపూర్ స్టేషన్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. మెట్రో అనుసంధానంపై త్వరలో రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ కు సిద్దమవుతున్న డిపిఅర్ సీఎం కేసీఅర్ అలోచనకు అనుగుణంగా నగరంలో నలు మూలల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించే ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రేస్ కు డీపిఅర్ అగస్టు కల్లా సిద్దమవుతుందని మంత్రి కేటీఅర్ తెలిపారు. రెండో దశ ప్రాజెక్టు రిపోర్టు జూలై కల్లా రానుందన్నారు. మూడు కారిడార్ల మెట్రోతో అనుసందానం అవుతాయని, ఇందులో గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టు, ఎల్బీనగర్ నుంచి నాగోల్, నాగోల్ నుంచి ఫలక్ నామా, ఫలక్ నామా నుంచి శంషాబాద్వ రకు రెండోధశ మెట్రోమార్గం ఉంటుందన్నారు. బంగారు తెలంగాణలో ఒక భాగం ఈ మెట్రో అన్నారు.